Header Ads

ad

On This Day : 1978 August 12 రంగారెడ్డి జిల్లా గా అవతరించింది.


రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి. 1978లో హైదరాబాదు జిల్లా నుంచి విడదీసి ఏర్పాటుచేశారు.
             
     హైదరాబాదు 1948లో నిజాం నిరంకుశ పాలన అంతం తర్వాత రాష్ట్రంలో హైదరాబాదు జిల్లాలో భాగంగా ఉండింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కూడా 1978 వరకు హైదరాబాదు జిల్లాలోనే కొనసాగింది. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత నీలం సంజీవ రెడ్డి మంత్రివర్గములో సభ్యుడైన కె.వి.రంగారెడ్డి పేరు మీదుగా ఈ జిల్లాకు నామకరణము చేశారు. ఈ జిల్లా ఇంతకు మునుపు హైదరాబాదు జిల్లాలో భాగంగా ఉండేది 1978లో హైదరాబాదు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి కె.వి.రంగారెడ్డి పేరిట ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. తర్వాత జిల్లాపేరు లోంచి K.V పదాలను తొలిగించారు.రంగారెడ్డి జిల్లా ఏర్పాటు సమయంలో 11 తాలుకాలు ఉండగా 1986లో మండలాల వ్యవస్థ ప్రారంభం కావడంతో తాలుకాల స్థానంలో 37 మండలాలు ఏర్పడ్డాయి.

No comments