భారత అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్ సారాభాయ్ జయంతి నేడు !
భారత అంతరిక్ష రంగ పితామహుడు విక్రం అంబాలాల్ సారాభాయి ఆగస్టు 12, 1919 జన్మించారు. భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు.
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో ధనవంతులైన వ్యాపారస్తుల కుటుంబం లో విక్రం సారాభాయ్ గారు జన్మించారు. ఆయన తండ్రి అంబాలాల్ సారాభాయ్, సరళా దేవి దంపతులకు కలిగిన ఎనిమిది మంది సంతానంలో విక్రం సారాభాయ్ ఒకడు.
వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం మూలాన వారింటికి మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, మరియు జవహర్‌లాల్ నెహ్రూ మొదలైన ఎంతో మంది ప్రముఖులు తరచూ వస్తూ ఉండేవారు. వీరు విక్రం సారాభాయ్ వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు.
విద్య !
అహ్మదాబాదులోని గుజరాత్ కళాశాల నుంచి మెట్రిక్ పాసయ్యాడు. తరువాతి చదువుల కోసం ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. 1940లో అక్కడ నుంచి నాచురల్ సైన్సెస్ లో ట్రిపోస్ లో ఉత్తీర్ణుడయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం అప్పటికే ప్రారంభం అవడంతో భారతదేశానికి తిరిగి వచ్చి బెంగుళూరు లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సి.వి. రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపైన పరిశోధన మొదలుపెట్టాడు. రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత 1945లో తిరిగి కేంబ్రిడ్జి వెళ్ళి పీహెచ్‌డీ పట్టాను సాధించుకుని 1947లో తిరిగి భారత దేశానికీ వచ్చారు.
అంతరిక్ష పరిశోధనలకు పునాది !
1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు... భారత భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ల అవసరం గురించి ఎంతో విషయ సేకరణ చేయటమేగాకుండా, ఆ శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్ నెహ్రూకు వివరించి, ఆయనను ఒప్పించారు . తరువాత 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడయిన హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (INCOSPAR) సెంటర్‌ను ఆయన ఏర్పాటు చేశారు. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా ఇస్రో ఎన్నో విజయాలను సాధించి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేస్తూన్నది.
"భారత అంతరిక్ష రంగ పితామహుడు"గా కీర్తి గడించిన సారాభాయ్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 1962లో శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డుతో, 1966లో పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. జాతీయ స్థాయిలోను, అంతర్జాతీయంగానూ అర్థవంతమైన పాత్ర పోషించగలగాలంటే, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని మానవ సమాజ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడంలో మనం ఎవరికీ తీసిపోకుండా ఉండాలని” చెప్పి, ఆ దిశగా కృషి చేసిన వ్యక్తి సారాభాయ్ గారు.
గ్రామీణ ప్రజల కోసం ఉపగ్రహాలను రూపొందించటం విక్రమ్ ఆయన వ్యూహలలో ప్రధానమైనదిగా ఉండేది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొని వచ్చినప్పుడే మన దేశంలోని ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చని సారాభాయ్ తోటి శాస్త్రవేత్తలను ప్రొత్సహించేవారు.
సహజ వనరుల వివరాలు సేకరించే పరిజ్ఞానాన్ని రూపొందించటం, రిమోట్ సెన్సింగ్‌కు అవసరమైన సాధనాలను ఏర్పాటు చేసుకోవటం అనేవి అందులో కీలక భాగాలు. ఈ రంగాలను ఎలా ఉపయోగించుకోవాలి? అంతరిక్షంలోకి మానవుల్ని ఏలా పంపాలి? సంప్రదాయపద్ధతిలో ఉన్న వ్యవస్థల్లోకి అంతరిక్ష వ్యవస్థను ఎలా కలపాలి? అన్న విషయాలన్నీ విక్రమ్ సారాభాయ్ వ్యూహాల్లో భాగాలుగా ఉండేవి.
ముఖ్యమైన విషయాలు !
- కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రధాన కేంద్రానికి విక్రమ్ సారాభాయ్ గారి (VSSC) పేరు పెట్టబడింది.
- అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏర్పాటుకు ముఖ్య పాత్ర పోషించారు.
- 1962 లో ఫిజిక్స్ విభాగం అధ్యక్షుడు, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్.
- 1970 I.A.E.A., జనరల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, వియన్నా.
- 1971 వైస్ ప్రెసిడెంట్, నాలుగో ఐక్యరాజ్య సదస్సు 'అటామిక్ ఎనర్జీ యొక్క శాంతియుతమైన ఉపయోగాలు.
భారత దేశానికీ చేసిన సేవలకు భారతరత్న అవార్డు ప్రధానం చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.
History Plus In.
Post a Comment