Header Ads

ad

History Plus In : క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమై నేటి తో 75 సంవత్సరాలు..



క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమై నేటి తో 75 సంవత్సరాలు..


రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారత రక్షణను ప్రజాప్రభుత్వానికి అప్పజెప్పాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. యుద్ధం ముగిసిన తర్వాత భారతీయుల కోర్కెల గురించి సానుకూలంగా స్పందిస్తామని బ్రిటన్ రాయబారం పంపింది.

ఆ ప్రతిపాదనలు ‘దివాలా తీసేందుకు సిద్ధంగా ఉన్న బ్యాంకుపై ఇచ్చిన చెక్కులా’ ఉన్నాయని గాంధీజీ
వారిని ఎద్దేవా చేశారు.దీనికిగాను గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని రూపొందించారు. 1942, జూలైలో వార్ధాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బ్రిటిష్‌వారిని భారతదేశం వదిలివెళ్లమని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీన్నే ఆంగ్లంలో "క్విట్ ఇండియా" అంటారు.


  •  అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 1942, ఆగస్టు 8న ఆమోదించడంతో జాతీయోద్యమం తుది దశ బొంబాయిలో ప్రారంభమైంది. అదే రోజు గాంధీజీ అశేషజనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఐక్య రాజ్యాల విజయం కోసం, భారతదేశం కోసం భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే ముగియడం అత్యవసరం. కావున అహింసాయుత ప్రజాపోరాటమే ఏకైక మార్గమని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది.
  •  1942, ఆగస్టు 9న గాంధీని, ప్రముఖ నాయకులందరినీ ప్రభుత్వం నిర్బంధించడమే కాకుండా కాంగ్రెస్ సంస్థను నిషేధించింది. పోలీసులు ఉద్యమాన్ని అణచివేసేందుకు క్రూరమైన చర్యలకు దిగారు. ప్రజలకు గాంధీజీ "డూ ఆర్ డై" (ఉద్యమించండి లేదా మరణించండి) అని పిలుపునిచ్చారు. 
  • -అంతేకాక మనం భారతదేశాన్ని విముక్తి అయినా చేద్దాం లేదా ఆ ప్రయత్నంలోనైనా మరణిద్దాం అని ఆయన అన్నారు. అందుకు అహింసాత్మక ప్రజా ఉద్యమమే మార్గమని గాంధీజీ చెప్పారు. 
  • -జాతీయ నాయకులందరూ అరెస్టయినప్పు డు అరుణా అసఫ్ అలీ, జయప్రకాష్ నారాయణ్ లాంటి రెండో తరం నాయకులు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 

క్విట్‌ ఇండియా’ నినాదం ఎవరిది?

దేశ స్వాతంత్య్రోద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వ్యూహ రచన చేస్తున్న మహాత్మాగాంధీ తన సహచరులతో ముంబైలో సమావేశమైనప్పుడు స్వాతంత్య్ర పోరాటానికి పనికొచ్చి మంచి నినాదాలను సూచించాల్సిందిగా వారిని కోరారు. అందుకు ‘గెటవుట్‌’ అని ఎవరో సూచించారు. అదంత మర్యాదగ లేదని గాంధీ తిరస్కరించారు. ‘రిట్రీట్‌ ఆర్‌ విత్‌డ్రా’ అన్న పదాన్ని రాజగోపాలచారి సూచించారు. అక్కడే ఉన్న యూసుఫ్‌ మెహరల్లీ ‘క్విట్‌ ఇండియా’ పదాన్ని సూచించారు. యే! మేన్‌ అంటూ గాంధీ వెంటనే ఆ పదాన్ని ఆమోదించారు. 


గాంధీజీ అశేషజనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన వీడియో !




No comments