స్వతంత్ర భారత సేనాని భారత మాత ముద్దు బిడ్డ జయహో జై హింద్ ! On This Day - History Plus In.
నేతాజీ' సుభాష్ చంద్రబోస్ ఈ పేరు వింటేనే భారత దేశం మొత్తం పులకిస్తుంది. (జనవరి 23, 1897 ) అతను గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు . భారత దేశ స్వాతంత్ర్యం ఉద్యమంలో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. భారత దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు.
స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు.
బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశారు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డారు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక మంచి సువర్ణవకాశంగా బోసు భావించారు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ఫౌజ్ ను సింగపూర్ లో ఏర్పరచాడు.
సుభాష్ చంద్రబోస్ మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నా 1945 ఆగస్టు 18 న తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికి, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు. ఏదైనప్పటికీ ఆయన మరణం ఒక రహస్యం.
భారత మాత ముద్దు బిడ్డ జయహో జై హింద్ !
Post a Comment